Skip to main content

Namaste NRI

భక్తుడికీ, భగవంతుడికీ మధ్య జరిగే కథ ఇది : శ్రీకాంత్‌

శ్రీకాంత్‌, లయ జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ మిస్టర్‌ మిడిల్‌ క్లాస్‌. డా.రాజేంద్రప్రసాద్‌ కీలకపాత్ర పోషించారు. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకుడు. చందు నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఇది ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్‌. ఒక భక్తుడికీ, భగవంతుడికీ మధ్య జరిగే కథ ఇది. దేవుడు దిగిరావాలంటే భక్తి ఎంత ముఖ్యమో ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమాకు అసలు హీరో వెంకటేశ్వరస్వామి. ఆ పాత్రను రాజేంద్రప్రసాద్‌ అద్భుతంగా పోషించారు. ఇందులోని ప్రతి పాత్రనూ, ప్రతి పంచ్‌నూ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు అని అన్నారు.

రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్నదని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు నిర్మాత చందు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, డీవోపీ అంజి, మురళీగౌడ్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News