Skip to main content

Namaste NRI

తాలిబన్ల సంచలన నిర్ణయం

తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి భద్రతలు రోజురోజుకు దిగజారుతుండడంతో ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో వ్యాపారులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు తమ స్వీయ రక్షణ ఆయుధాలను వెంట తీసుకువెళ్లవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆయా సాంకేతిక సమస్యల పరిష్కారం ఆనంతరం ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు తెలిపింది. వ్యాపారులు, పెట్టుబడిదారుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి సయీద్‌ ఖోస్టాయ్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News