Skip to main content

Namaste NRI

కామ్రేడ్ కళ్యాణ్ నుంచి మైమరపించే లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ జంటగా నటిస్తున్న పీరియడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కామ్రేడ్‌ కళ్యాణ్‌. జానకిరామ్‌ మారెళ్ల దర్శకుడు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. కోన వెంకట్‌ సమర్పకుడు. సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ఇంత ఇష్టమా.. ఇంత ఇష్టమా.. పొంగిపోతున్నా ఈ ఒక్కమాటకీ.. ఇష్టమంటేనే ఇంత కష్టమా.. లొంగిపోతున్నా నీ పిచ్చిప్రేమకీ అంటూ సాగే ఈ లవ్‌ మెలొడీని భాస్కరభట్ల రవికుమార్‌ రాయగా, విజయ్‌ బుల్గానిన్‌ స్వరపరిచారు.

రామ్‌ మిర్యాల, లిప్సిక ఆలపించారు. హీరోలోని నిస్వార్థమైన ప్రేమకు మెస్మరైజ్‌ అయిన హీరోయిన్‌ భావోద్వేగానికి లోనవుతూ పాడిన పాట ఇదని సాహిత్యం వింటే అర్థమవుతున్నది. ఈపాటలో శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ల కెమిస్ట్రీ యువతను ఆకట్టుకుంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. 1992 నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంత నేపథ్య కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమాయే ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌, నిర్మాణం: స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ.

Social Share Spread Message

Latest News