Skip to main content

Namaste NRI

సౌదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఇరాన్ నూత‌న సుప్రీం లీడ‌ర్ మొజ్తాబా ఖ‌మేని ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్నాడు అనే అంశంపై అనేక సందేహాలున్నాయి. ఆయ‌న ఇరాన్‌లో ఉన్నార‌ని కొంద‌రు అంటుంటే, ర‌ష్యాలో చికిత్స తీసుకుంటున్నార‌ని ఇంకొంద‌రు భావిస్తున్నారు. ఆయ‌న స్థావ‌రం విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. అధికారికంగా ఇరాన్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా లేదు. కానీ, తాజాగా ఈ అంశంపై సౌదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ విష‌యాన్ని ఇజ్రాయెల్ భద్ర‌తా ద‌ళాలు కూడా ధ్రువీక‌రించాయి. ఇరాన్‌లో లేడ‌ని చెప్పిన‌ప్ప‌టికీ, ఎక్క‌డున్నాడు అనే విష‌యంలో స్ప‌ష్ట‌త మాత్రం లేదు.

ఫిబ్ర‌వ‌రి 28న ఇరాన్‌పై అమెరికా జ‌రిపిన దాడిలో మొజ్తాబా తండ్రి అయ‌తొల్లా ఖ‌మేనితోపాటు అత‌డి కుటుంబ స‌భ్యులు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌లో మొజ్తాబా గాయ‌ప‌డ్డాడు. అప్ప‌టినుంచి అత‌డు బ‌హిరంగంగా క‌నిపించింది లేదు. ఇటీవ‌ల జ‌రిగిన తండ్రి, కుటుంబ స‌భ్యుల అంత్య‌క్రియ‌ల‌కు కూడా ఆయ‌న హాజ‌రుకాలేదు. దీంతో ఆయ‌న ఉనికిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే స‌మ‌యంలో అమెరికాకు, ఇజ్రాయెల్‌కు త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని ఇటీవ‌ల మొజ్తాబా త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఇరాన్, అమెరికా మ‌ధ్య తీవ్ర యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

Social Share Spread Message

Latest News