Skip to main content

Namaste NRI

సౌదీతో అమెరికా ఒప్పందం ఎందుకు?

సౌదీ అరేబియాతో అమెరికా చారిత్ర‌క అణు ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీతో కుదిరిన అణు ఒప్పందానికి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. దీంతో ఇరు దేశాల మ‌ధ్య 30 ఏళ్ల‌పాటు అణు ఒప్పందం అమ‌లులో ఉండ‌నుంది. అయితే, ఈ అణు ఒప్పందం అణు బాంబు త‌యారీకి సంబంధించింది కాదు. అణు శుద్ధికి సంబంధించిది మాత్ర‌మే. అంటే, సౌదీ అరేబియాలో యురేనియం శుద్ధి కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తారు. అమెరికా, సౌదీ క‌లిపి సంయుక్తంగా వీటిని నిర్వ‌హిస్తాయి.

ఇందుకోసం అమెరికా సంస్థ‌లు సౌదీలో భారీగా పెట్టుబ‌డులు పెడుతాయి. ఈ ఒప్పందం 30 ఏళ్ల వ‌ర‌కు అమ‌లులో ఉంటుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన వివ‌రాల్ని ట్రంప్ ప్ర‌భుత్వం అక్క‌డి కాంగ్రెస్ ముందు ఉంచబోతుంది. అక్క‌డ స‌మీక్ష అనంత‌రం ఈ ఒప్పందం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే, వాళ్లు ఈ ఒప్పందంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉంది. యురేనియం శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌నేది సౌదీకి చాలా ఏళ్ల క‌ల‌. ఈ ఒప్పందం ప్ర‌కారం సౌదీ అణుబాంబు తయారు చేసే అవ‌కాశం లేదు. యురేనియం శుద్ధి మాత్ర‌మే చేస్తుంది. అయితే, గ‌ల్ఫ్ లాంటి ఇత‌ర ప్రాంతాల్లో అణు కార్య‌క్ర‌మాలకు దూరంగా ఉండాల‌నే అమెరికా విధానం విష‌యంలో ఈ ఒప్పందం మారింది.

Social Share Spread Message

Latest News