
హొర్ముజ్ జలసంధిలోని నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపిన ప్రతిసారి ఆ దేశంలోని వంతెన పైనో, విద్యుత్తు ప్లాంట్ పైనో దాడి చేసి దానిని నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. అమెరికాలో 9/11 తరహా దాడులు చేస్తామని ఆ దేశానికి టెహ్రాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం కొనసాగితే అమెరికాలో జాతీయ సంతాప దినాలు చేసుకోవాల్సి ఉంటుందని, అమెరికా ఇంధన కేంద్రాలు, వంతెనలు లక్ష్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. తమ సూచనలు పాటించిన నౌకలకు మాత్రమే హర్మూజ్‌లో సురక్షిత ప్రయాణానికి అవకాశం ఉంటుందని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సంస్థ తస్నిమ్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.





























