Skip to main content

Namaste NRI

అభిమానులు ప్రయోజకులు అయితే అంతకు మించిన ఆనందం ఉండదు : మెగాస్టార్‌

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటించిన చిత్రం చెన్నై లవ్‌స్టోరీ. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకుడు. ఎస్‌కేఎన్‌, సాయిరాజేష్‌ నిర్మాతలు. హైదరాబాద్‌లో జరిగిన చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్‌ వినగానే నేనొక్కసారిగా ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లిపోయాను. చెన్నైతో నాకున్న అనుబంధం, ప్రేమ గుర్తుకొచ్చింది. నిజంగా ఈ టైటిల్‌లో ఏదో మ్యాజిక్‌ ఉంది. నన్ను స్ఫూర్తిగా తీసుకొని అభిమానులు ప్రయోజకులు అయితే అంతకుమించిన ఆనందం ఉండదు. ఈరోజు వేదిక మీద అందరూ నా అభిమానులు ఉండటం సంతోషంగా ఉంది అన్నారు. ఈ చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్‌ నా అభిమానిగా హైదరాబాద్‌కు వచ్చి, సినిమాల మీద ప్రేమతో నిర్మాతగా ఎదిగారు. ఇక సాయిరాజేష్‌ మంచి సినిమాలు తీయడమే కాకుండా నేషనల్‌ అవార్డ్‌ పొందడం ఆనందంగా ఉంది. నిజంగా ఇలాంటి అభిమానుల్ని చూసి గర్విస్తున్నా. కిరణ్‌ అబ్బవరం మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. నాలుగైదు సినిమాలతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు అన్నారు.

హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ చిరంజీవి అన్నది పేరు కాదు. అది నాకో ఎమోషన్‌. ఈ వేదికలో ఆయన ముందునిల్చొని మాట్లాడటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నేను పోషించిన స్టీవెన్‌ అనే పాత్ర నా వ్యక్తిగత జీవితానికి కూడా బాగా కనెక్ట్‌ అయింది అని చెప్పారు. తన కెరీర్‌లోనే బెస్ట్‌ పాత్రను పోషించానని కథానాయిక శ్రీగౌరీప్రియ ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రం 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News