
విదేశీ వృత్తి నిపుణులకు జారీచేసే హెచ్1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధింపు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫీజులు చట్టబద్ధం కాదంటూ ఇటీవల దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే ఇచ్చేందుకు అప్పీల్స్ కోర్టు నిరాకరించింది. దీనిపై స్టే ఇవ్వకపోవడం వల్ల దేశానికి వచ్చే నష్టం ఏంటో తెలియజేయటంలో ట్రంప్ యంత్రాంగం విఫలమైందని పేర్కొన్నది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు దీనిపై నిర్ణయం తీసుకోలేరని పేర్కొన్నది. అమెరికా తాత్కాలిక వలస వీసా హెచ్1బీకి ఎంపికైన వారు లక్ష డాలర్ల ఫీజును చెల్లించాలని గత సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని సవాల్ చేస్తూ 20 రాష్ర్టాల్లోని అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన యూఎస్ డిస్ట్రిక్ కోర్టు లక్ష డాలర్ల ఫీజు చట్ట విరుద్ధమని తీర్పు చెప్పింది.





























