Skip to main content

Namaste NRI

చెన్నై లవ్‌స్టోరీ మా నమ్మకాన్ని నిలబెట్టింది : ఎస్‌కేఎన్‌

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన చిత్రం చెన్నై లవ్‌స్టోరీ చిత్రం. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్‌, సాయిరాజేష్‌ నిర్మించారు. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ప్రీమియర్స్‌ నుంచే థియేటర్స్‌ వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డ్‌లు దర్శనమిస్తున్నా యని, ఫ్యామిలీ ఆడియెన్స్‌ సినిమాకు బాగా కనెక్ట్‌ అవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండే కథతో ఈ సినిమా తీశాం. బయ్యర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ ఫోన్‌ చేసి షోస్‌ పెంచుతున్నామని చెబుతున్నారు. మొదటిరోజే 12.3కోట్లు వసూలు చేసింది. హీరో కిరణ్‌ అబ్బవరంకు హ్యాట్రిక్‌ విజయమిది. కలర్‌ఫోటో, బేబి సినిమాలతో మా సంస్థకు మంచి పేరొచ్చింది. నేడు చెన్నై లవ్‌స్టోరీ మా నమ్మకాన్ని మరింతగా నిలబెట్టింది. మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనడానికి ఈ సినిమా విజయమే నిదర్శనం అన్నారు. తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ రావడంతో దర్శకుడిగా తన కల నిజమైందని దర్శకుడు రవి నంబూరి పేర్కొన్నారు. ఈ సినిమా తమ సంస్థ గౌరవాన్ని పెంచిందని చిత్ర రచయిత, నిర్మాత సాయిరాజేష్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News