దుల్కర్ సల్మాన్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ శ్రీశ్రీ. రవి నెలకుదిటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ బొమ్మ బొమ్మ అనే పాటను విడుదల చేశారు.

జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ పాటను అనంతశ్రీరామ్ రచించారు. బొమ్మ బొమ్మ..నిను మళ్లీ గీసిందెవరమ్మా.. బంగారంలో మరి ముంచి తీసిందెపుడమ్మా..అడుగూ అడుగూ నువు నడిచెళ్లేటి దారంతా అంటూ మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని, ఆహ్లాదభరితమైన ప్రేమకథగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, రచన-దర్శకత్వం: రవి నెలకుదిటి.





























