Skip to main content

Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ తో జెలెన్‌స్కీ భేటీ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరం చేయడం, రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్‌ ప్రతి దాడులు జరపడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. అమెరికా మద్దతు పొందేందుకు ఈ భేటీని జెలెన్‌స్కీ ఉపయోగించుకుంటారని తెలుస్తోంది.

అమెరికా పర్యటనకు వెళ్లే ముందు జెలెన్‌స్కీ విలేకరులతో మాట్లాడుతూ రష్యాలోని ఎగుమతి టెర్మినల్‌, చమురు కేంద్రాలపై దాడులు చేశామని చెప్పారు. యుద్ధానికి రష్యా ఆర్థిక మద్దతు అందకుండా చేయడమే తమ ఉద్దేశమని, గౌరవప్రదమైన శాంతి స్థాపనే అంతిమ లక్ష్యమని తెలిపారు. కాగా ఇరువురు నేతలు కొద్ది రోజుల క్రితం టర్కీలో జరిగిన నాటో సదస్సు సందర్భంగా సమావేశమైన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News