
అమెరికాతో చర్చల కోసం ఇరాన్ మూడు షరతులను విధించడమే కాకుండా, హొర్ముజ్ జలసంధిగుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. మొదట హొర్ముజ్ జలసంధిపై చర్చలు ప్రారంభించి, అది పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేయాలని టెహ్రాన్ కోరుతున్నది. రెండవది స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలి. మూడవది ఈ రెండు అంశాలు పరిష్కారమైన తర్వాతే ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై చర్చించాలి.





























