కొద్దిరోజులు సద్దుమణిగింది అనుకున్న ఇరాన్-అమెరికా యుద్ధం మళ్లీ కొనసాగుతున్నది. ఇరాన్‌పై భీకర దాడులకు పాల్పడుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించ డంతో పశ్చిమాసియాలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ క్షిపణులను గాల్లోనే కూల్చివేశామని జోర్డాన్ సైన్యం తెలిపింది. ఇరాన్ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జోర్డాన్ సైన్యం స్పష్టం చేసింది.

కాగా, ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడింది. దీనిని అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. మరోవైపు జోర్డాన్, ఈజిప్టులోని అమెరికా గ్యాస్ నౌకలపై దాటిపట్ల ట్రంప్ ఘాటుగా స్పందించాడు. వాళ్లు దాడి చేశారు. ఇప్పుడు మా వంతు వచ్చింది. ఇరాన్‌ను ఊహించని రీతిలో దెబ్బ కొడుతాతమని హెచ్చరించారు.





























