Skip to main content

Namaste NRI

ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా ది మేజ్ ఫస్ట్ సింగిల్

హీరో శ్రీరామ్‌ నటిస్తున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ది మేజ్‌. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్‌, కమల్‌ కామరాజు కీలక పాత్రధారులు. డాక్టర్‌ రవికిరణ్‌ గడలాయ్‌ దర్శకుడు. డాక్టర్‌ ఉదయ్‌ కె.రెడ్డి పాల్వాయి, డాక్టర్‌ కరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ భరత్‌రెడ్డి గోపు, డాక్టర్‌ అనిరుధ్‌రెడ్డి సోమ నిర్మాతలు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది. మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను హీరో ఆనంద్‌ దేవరకొండ విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

నన్నే నన్నే మనిషిగా గుర్తించావే.. నన్నే నన్నే మార్చేశావే.. మన్ను మిన్ను కలిపేలా పైవాడే.. నన్నూ నిన్నూ కలిపాడే అంటూ సాగే ఈ పాటను విజయ్‌కుమార్‌ రాయగా, శ్రవణ్‌ భరద్వాజ్‌ స్వరపరిచారు. కపిల్‌ కపిలన్‌ ఆలపించారు. హీరోయిన్‌ పట్ల హీరో ప్రేమారాధన చూపిస్తూ ఆకట్టుకునేలా ఈ పాట సాగింది. ఈ చిత్రానికి నిర్మాణం: యూఆర్‌ క్రియేషన్స్‌, శ్రౌష కమల ఆర్ట్స్‌.

Social Share Spread Message

Latest News