వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆదర్శకుటుంబం ఏకే 47. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం. అత్యంత వినోదాత్మకంగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ముందు ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ చిత్రాన్ని ఓ వారం ఆలస్యంగా, అనగా అక్టోబర్ 9న విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.

ప్రేక్షకులకు సంపూర్ణమైన వినోదానుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే సినిమా రిలీజ్‌ను వారం రోజులు వాయిదా వేశామని, వినోదం, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనమే ఈ సినిమా అని చిత్రబృందం పేర్కొన్నది. మధ్యతరగతి వ్యక్తిగా వెంకటేశ్ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి కథానాయిక. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావురమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ కీలకపాత్రధారులు.















