Skip to main content

Namaste NRI

అమెరికాకు ఇరాన్‌ కీలక ప్రతిపాదన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొన‌సాగుతున్న వేళ అగ్ర‌రాజ్యం అమెరికాకు ఇరాన్‌ కీలక ప్రతిపాదన చేసింది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు సిద్ధమని తెలిపింది. ఈ విషయాన్ని ఓ సీనియర్‌ ఇరాన్‌ అధికారి వెల్లడించారు. మధ్యవర్తుల ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు చేరవేసినట్లు తెలుస్తోంది. అమెరికాతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ ప్రతిపాదనతో ఇరాన్‌ సంకేతాచ్చింది.

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సందర్భంగా న్యూయార్క్‌లో మధ్యవర్తి దేశాలతో ఈ అంశంపై చర్చించాలని టెహ్రాన్‌ భావిస్తోంది. ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య భేటీ ఉండబోదని ఇరాన్‌ అధికారి తెలిపారు. అయితే అమెరికా నిబద్ధత చూపితే ఒప్పందం దిశగా వెళ్లే అవకాశం ఉందన్నారు. హర్మూజ్‌ జలసంధికి సంబంధించిన సైనిక చర్యలను అమెరికా నిలిపివేయాలని ఇరాన్‌ కోరుతోంది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, ఇరాన్‌ పోర్టులపై ఆంక్షలు ఎత్తివేస్తే జలసంధిని తిరిగి తెరిచి చర్చలను కొనసాగిస్తామని టెహ్రాన్‌ చెబుతోంది. పోర్టులపై ఆంక్షలు ఇరాన్‌ ముడిచమురు ఎగుమతులు, సముద్ర రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. చర్చలను పునరుద్ధరించేందుకు ఇరాన్‌ గతంలో ఏడు షరతులను కూడా వెల్లడించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events