Skip to main content

Namaste NRI

గాజాలో కీలక పరిణామం.. హమాస్ అంగీకారం

గాజా సమస్య పరిష్కారానికి హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. గాజా నుంచి ఇజ్రాయెల్‌ సైన్యాన్ని ఉపసంహరించిన వెంటనే హమాస్‌, ఇతర సాయుధ దళాలు తమ ఆయుధాలను అప్పగించడానికి అంగీకరించాయని తెలిపారు. అయితే ఈ ఒప్పందం పలు దశల్లో అమలవుతుందన్నారు. ఇజ్రాయెల్‌ దళాల ఉపసంహరణ క్రమంగా జరుగుతుందని, అలాగే హమాస్‌ ఆయుధాల అప్పగింత కూడా దశల వారీగా జరుగుతుందని చెప్పారు.

Social Share Spread Message

Latest News