Skip to main content

Namaste NRI

జపాన్‌ శాస్తవ్రేత్తల అద్భుత ప్రయోగం!

జపాన్‌ శాస్తవ్రేత్తలు జంతు కణాల్లోకి మొక్కల జన్యువును ప్రవేశపెట్టి సరికొత్త ప్రయోగం చేశారు. ఈ హైబ్రిడ్‌ కణాలకు ప్లానిమల్‌ కణాలని పేరు పెట్టారు. ప్లాంట్‌ (మొక్క), యానిమల్‌ (జంతువు) అనే పదాల కలయికే ఈ పేరు. అయితే ఇవి జంతువు, మొక్క కలిసిన కొత్త జీవులు కావు. ప్రయోగశాలలో రూపొందించిన సంకర కణాలు మాత్రమే. టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ సచిహిరో మత్సునాగా నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ ప్రయోగం నిర్వహించింది.

చైనా హ్యామ్‌స్టర్‌ (చిట్టెలుక) అండాశయ కణాల్లోకి ఎరుపు శైవలం(సముద్రపు నాచు)కు చెందిన సైనిడియోస్కిజోన్‌ మెరోలే జన్యువును ప్రవేశపెట్టారు. ఒక కణంలో శైవలానికి చెందిన జన్యువులో దాదాపు 98.8 శాతం నిలిచినట్లు గుర్తించారు. ఈ జన్యువు 150కిపైగా కణ తరాల వరకు కొనసాగడం విశేషం. యాంటీబయాటిక్స్‌ వినియోగం లేకుండానే కొన్ని జన్యు భాగాలు 95 తరాల వరకు నిలిచాయి. అయితే ప్రొటీన్లను తయారుచేసే జన్యువుల్లో సుమారు 96 శాతం క్రియారహితంగా ఉన్నాయి. కణంలోని ఎపిజెనెటిక్‌ నియంత్రణ వ్యవస్థ వాటి పనితీరును అడ్డుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events