సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా సినిమాకు రికార్డ్ అనే పేరును ఖరారు చేశారు. వీర కోగటం దర్శకునిగా పరిచయం అవుతున్నారు. వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు సుకుమార్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత దిల్‌రాజు క్లాప్ ఇచ్చారు. బన్నీ వాసు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు డీవీవీ దానయ్య, దిల్ రాజు చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ సుకుమార్‌గారితో అసోసియేషన్, అలాగే క తర్వాత వంశీ నందిపాటితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. రికార్డ్ అనే టైటిల్ లాగే, సినిమా కూడా అందరికీ నచ్చుతుంది.18ఏండ్లు మీడియాలో పనిచేసిన వీర ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ కథతోపాటు ఆయనలోని తపన నాకెంతో నచ్చింది. కచ్చితంగా అందరూ గర్వపడే సినిమా అవుతుంది అన్నారు. ఓ మంచి కథతో వస్తున్నామని, కర్నూల్ కొండారెడ్డి బురుజు సాక్షిగా ఓ మంచి సినిమా ఇస్తున్నామని దర్శకుడు వీర కోగటం నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాతలు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌రెడ్డి, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్. నిర్మాణం: వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్.















