అమెరికా తమకు ఏకంగా 290 బిలియన్ డాలర్ల భారీ నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ న్యాయస్థానాలు సంచలన తీర్పు వెలువరించాయి. ఈ విషయాన్ని ఇరాన్ న్యాయశాఖ అధికార ప్రతినిధి హసన్ అబ్దోలియాన్‌పౌర్ అధికారికంగా ధృవీకరించారు. దశాబ్దాల కాలంగా ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న ప్రతికూల చర్యలు, ఆర్థిక ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు బదులుగా ఈ భారీ మొత్తాన్ని వసూలు చేయాలని కోర్టులు స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.

కేవలం అమెరికాపైనే కాకుండా, పొరుగున ఉన్న గల్ఫ్ అరబ్ దేశాలపైనా ఇరాన్ న్యాయస్థానాల్లో పలు వ్యాజ్యాలు నమోదైనట్లు హసన్ అబ్దోలియాన్‌పౌర్ వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికా దాడులు నిర్వహించడానికి తమ భూభాగాలను, సైనిక స్థావరాలను వాడుకునేందుకు అనుమతించినందుకే ఆయా దేశాలపై కేసులు దాఖలయ్యాయని ఆయన వివరించారు.















