
జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల ప్రచార వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ బాజపాకు షాక్ ఇచ్చారు, బిహార్ లో బాజపాకు కంచుకోటైన బాంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి అనూహ్య విజయం సాధించారు. బాజపా అభ్యర్థి నీరాఙ్ కుమార్ పై తొలి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించి 18,964 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. బాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు అడ్డాగా ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ల తరువాత బాజపా ఓటమి పాలయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందిన నితిన్ నబీన్ బాజపా జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు అలాగే ఆయన రాజ్యసభకు నామినేట్ కావడంతో తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.





























