అమెరికాలో డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా నుంచి డీజిల్ ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించబోమని స్పష్టం చేశారు. ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా జీ7 దేశాలు తమ అత్యవసర ఇంధన నిల్వల్లో కొంత భాగాన్ని విడుదల చేసేందుకు అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ అమెరికా డీజిల్ ఎగుమతులను నిలిపివేసే ఆలోచన లేదని తెలిపారు. యూరప్ వద్ద కూడా భారీగా డీజిల్ నిల్వలు ఉన్నాయని, ప్రపంచ ఇంధన సరఫరాకు యూరప్‌తో పాటు అమెరికా కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు. గత నెలలో డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను పరిశీలించాలని తన సలహాదారులకు సూచించినట్లు ట్రంప్ చెప్పినప్పటికీ, తాజాగా అలాంటి నిషేధం ఎప్పుడూ తీవ్రమైన ప్రతిపాదన కాదని వ్యాఖ్యానించారు.















