Skip to main content

Namaste NRI

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది: వేణు దోనేపూడి

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 9న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయె, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు ఓయ్, కార్తికేయ, విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, శుభలేఖ సుధాకర్, రాజారవీంద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు అద్భుతాలు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా సినిమా కూడా అలాంటి విజయమే సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాం. అందరూ కుటుంబంతో కలిసి థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. దర్శకుడు గుణి మంచికంటి మాట్లాడుతూ ఇది రొటీన్ హీరో, హీరోయిన్, విలన్ తరహా సినిమా కాదు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర ఎంతో కీలకం. మేఘాలయ లాంటి సవాలుతో కూడిన లొకేషన్లలో తక్కువ సమయంలో పూర్తి చేయగలిగామంటే దానికి నటీనటులందరి సహకారమే కారణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్ర లిమాయె, విష్ణు ఓయ్, మాల్వీ మల్హోత్రా, సమృద్ధి ఆర్యాళ్, అక్షయ్ లగుసాని పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events