అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఉన్న ఓ హిందూ ఆలయం పై దాడి జరిగింది. ఆ ఆలయంపై ఇటుకలతో అటాక్ చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొన్నది. రిచ్‌మండ్ హైయిట్స్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ్ వడ్తల్ ధామ్ హిందూ మందిర్‌పై దాడి జరిగినట్లు ఆ ఫౌండేషన్ పేర్కొన్నది. ఇటుకలతో దాడి చేయడం వల్ల ఆలయంలో డ్యామేజ్ జరిగింది.

మరో వైపు అమెరికాలో ఉన్న భారతి సంతతి ప్రజలపై ఇటీవల దాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఆలయం సమీపంలో ఉన్న నిఘా వీడియోను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. గుడి పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు ఫౌండేషన్ పేర్కొన్నది. గుడిలో పూజారులు, భక్తులు ఉన్న సమయంలోనే ఇటుకలతో దాడి జరిగినట్లు తెలిసింది. అయితే ఆ దాడిలో ఆలయంలోని కిటికీలు దెబ్బతిన్నాయి.















