అంగరంగ వైభవంగా సాగుతున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ముఖ్యమంత్రికి మేళ తాళాల తో స్వగతం పలికారు. ముఖ్యమంత్రి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.ముఖ్యమంత్రితో పాటు మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీమతి దనసరి అనసూయ సీతక్క పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు, పలువురు ప్రజాప్రతినిధులు లష్కర్ బోనాల జాతరలో పాల్గొన్నారు.


































