Skip to main content

Namaste NRI

మంత్ర తంత్రాలకు అందని శక్తి .. అగధ ట్రైలర్‌ రిలీజ్‌

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్‌, భానుచందర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అగధ. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించారు. కాశీ విశాలాక్షి బలుసు నిర్మాత. ట్రైలర్‌ను విడుదల చేశారు. హారర్‌, థ్రిల్లర్‌ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్‌ సాగింది. మంత్ర తంత్ర విద్యలకు అందని శక్తి ఉంది. దాని గురించి నాకు తెలియాలి అది ఒక మూఢనమ్మకమైతే కాదు. చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి వంటి డైలాగ్స్‌ కథపై ఆసక్తినిరేకెత్తించేలా ఉన్నాయి.

ఈ సందర్భంగా ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ చిత్రాన్ని ఏడాదిలో పూర్తిచేశాం. యువతతో పాటు జెన్‌జీ వాళ్లని దృష్టిలో పెట్టుకొని ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాం. ఈ కథకు ఆర్టిస్టులందరూ పర్‌ఫెక్ట్‌గా కుదిరారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లే అనూహ్య మలపులతో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది అన్నారు. ఈ సినిమా వల్ల ఆధ్యాత్మికంగా తనలో చాలా మార్పులొచ్చాయని కథానాయిక కామాక్షి భాస్కర్ల తెలిపింది. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News