అమెరికాలోని వర్జీనియా లో తానా పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితులు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రవాస భారతీయులు తల్లిదండ్రులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమానికి ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరు కాగా తానా పాఠశాల చైర్మన్ భాను ప్రకాష్ మాగులురీ సమన్వయం చేశారు.ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ స్నేహ బంధం గొప్పదని, 60 ఏళ్ల వయసులో నలుగురు స్నేహితులు మనకు నిజమైన ఆస్తి అని అన్నారు, ఈ తరానికి తెలుగు భాష నేర్పించడంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. తరాల అనుసంధానం మాతృభాషతోనే సాధ్యమని అన్నారు.


భాను ప్రకాష్ మాగులురి మాట్లాడుతూ మాతృభాష మాతృభూమి మనకు రెండు కళ్లు అన్నారు, ఉద్యోగ వృత్తి వ్యాపార రీత్యా తెలుగు వారు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న అందరి ఉమ్మడి ఐక్య వేదిక తెలుగు భాషే అన్నారు. ఈ తరం చిన్నారులకు తెలుగు భాష నేర్పించడం ఇంటింటి బాద్యత అన్నారు. తరాల అంతరాన్ని భాషతో పూరిదామని చెప్పారు. ఈ సందర్భంగా అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు, పలువురు పెద్దలు మాట్లాడుతూ తమ జీవితాలలోని స్నేహితుల గురించి గుర్తు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.





























