
దుబాయ్ లో భారత కౌన్సిల్ జనరల్‌గా తొలి తెలుగు అధికారిగా వరంగల్ కు చెందిన ఐఎఫ్ఎస్ 2008 బ్యాచ్ కి చెందిన అధికారి ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. భాద్యతలు స్వీకరించిన అనంతరం తొలి అధికారిక సమావేశంలో వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC) చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని ఆయన కలిశారు. సమావేశంలో కృత్రిమ మేధా, సెమీ కండక్టర్లు , స్టార్ట్ ప్ లు, డిజిటల్ టెక్నాలజీ తదితర రంగాల్లో ఇండియా యూఏఈ మద్య పరస్పర సహకారంను బలోపేతం చేసేందుకు చర్చించినట్లు WTITC తెలిపింది. ప్రతినిధి బృందంలో దుబాయ్ కి చెందిన పారిశ్రామిక వేత్తలు తోట రామ్ కుమార్ , ఎస్ వి రెడ్డి, వూర కృష్ణ తదితరులు ఉన్నారు.






























