Skip to main content

Namaste NRI

సందీప్ కిషన్ కొత్త సినిమా కరికాల.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి కరికాల అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యుగంధర్‌ ముని దర్శకత్వంలో షైనింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సందీప్‌కిషన్‌ ఖడ్గాన్ని చేతబూని గుర్రంపై స్వారీ చేస్తూ, సింహాన్ని వేటాడుతూ ఓ యోధుడి అవతారంలో కనిపిస్తున్నారు. సోషియో ఫాంటసీ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అర్థమవుతున్నది.

ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని, తొలి భాగాన్ని వచ్చే ఏడాది జూలై 2న, రెండో భాగాన్ని అక్టోబర్‌ 28న విడుదల చేయబోతున్నామని మేకర్స్‌ తెలిపారు. అత్యాధునిక విజువల్‌ ఎఫెక్ట్స్‌, అద్భుతమైన కథ, కథనాలతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events