Skip to main content

Namaste NRI

మకుటం నుంచి కొత్త పోస్టర్ విడుదల

హీరో విశాల్‌ స్వీయ దర్శకత్వంలో మూడు భిన్న పాత్రల్లో కనిపించనున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మకుటం. సముద్రతీర ప్రాంత నేపథ్యంలో ఎత్తుకుపై ఎత్తులతో సాగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇదని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న 99వ సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ నెల 7న ట్రైలర్‌ను రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇందులో విశాల్‌ గ్యాంగ్‌స్టర్‌, ఓల్డ్‌ఏజ్‌ డాన్‌, కార్పొరేట్‌ ఎంప్లాయిగా మూడు భిన్న అవతారాల్లో కనిపిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో నడిచే ఈ కథలో విశాల్‌ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో ఉంటుందని, జీవీ ప్రకాష్‌కుమార్‌ మ్యూజిక్‌ హైలైట్‌గా నిలుస్తుందని, భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్‌ తెలిపారు. దుషార విజయన్‌, అంజలి, తంబి రామయ్య తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, కథ: రవి అరసు, నిర్మాత: ఆర్‌.బి.చౌదరి, దర్శకత్వం: విశాల్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events