Skip to main content

Namaste NRI

డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మిస్సింగ్‌ మేఘన. వాచస్పతి దర్శకత్వం. ఈ చిత్రాన్ని పంచుమర్తి నరేష్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

పరిశోధాత్మక కథాంశమిదని, ఆద్యంతం సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుందని, మేఘన అనే అమ్మాయి ఆచూకీ కోసం జరిగే ప్రయత్నాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి దర్శకుడు వాచస్పతి తెలిపారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత నరేష్‌బాబు పేర్కొన్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, మహిపాల్‌, రుచిత తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయనుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: ఆర్‌.ఆర్‌.ధృవన్‌, నిర్మాణ సంస్థ: ఫస్ట్‌కాపీ మూవీస్‌, కేడీ అండ్‌ కో, దర్శకత్వం: వాచస్పతి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events