Skip to main content

Namaste NRI

సర్దార్ సర్వాయి పాపన్న బయోపిక్… ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ సర్దార్ సర్వాయి పాపన్న. వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్ష‍ిస్తున్నారు. ఈ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా వచ్చే వారం థియేట్రికల్ విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర పోస్టర్ లాంచ్‌ వేడుకను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు.

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ దాదాపు 360 ఏళ్ల క్రితం బహుజన చక్రవర్తిగా వెలుగొందిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత కథతో వెంకటేష్ గౌడ్ దర్శక, నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మా ఆర్కే ఫిలింస్ ద్వారా వచ్చే వారం ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాను నేను చూశాను. మా వెంకటేష్ అద్భుతంగా రూపొందించాడు. సర్దార్ పాపన్న గొప్పతనం ఎక్కడా తగ్గించకుండా, ఆయన ఎన్ని పోరాటాలు చేశాడు?, ఎంతమందిని ఒక్కటి చేయ గలిగాడు?, ఎన్ని కుట్రలను ఛేదించాడు అనేది కళ్లకు కట్టినట్లు తెరకెక్కించాడు. అన్ని కులాల వారిని ఏకం చేసి, అన్యాయంగా వసూలు చేసే పన్నుల భారాన్ని ప్రజలకు తప్పించిన ప్రజానాయకుడు సర్వాయి పాపన్న అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events