Skip to main content

Namaste NRI

అనకాపల్లి మంచి సందేశంతో కూడిన యాక్షన్, ఫ్యామిలీ డ్రామా: త్రినాథరావు నక్కిన

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్యావశిష్ట, తారక్‌ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అనకాపల్లి. ఖగేష్‌ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. ఆంధ్రపదేశ్‌లోని అనకాపల్లిలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు సోనూసూద్‌ ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.

తన సొంత ఊరు అనకాపల్లిలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందని, ఫ్యామిలీ, యాక్షన్‌ అంశాల కలబోతగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత త్రినాథరావు నక్కిన తెలిపారు. అనకాపల్లిలోని రియల్‌ లొకేషన్లలో షూటింగ్‌ చేశామని నిర్మాత కాండ్రేగుల నాయుడు చెప్పారు. ఈ వేడుకలో చిత్రబృందమంతా పాల్గొన్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events