Skip to main content

Namaste NRI

అమెరికా ప్రభుత్వ కొత్త నిబంధన .. ఇకపై ఆ పద్ధతిలోనే!

గ్రీన్‌కార్డ్‌, పౌరసత్వం, ఆశ్రయం వంటి కొన్ని వలస దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దాఖలు చేయడాన్ని అమెరికా తప్పనిసరి చేయనున్నది. ఈ మార్పు వల్ల ఖర్చులు తగ్గుతాయని, పొరపాట్లు నివారించవచ్చని, కేసుల పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు తెలిపారు. ఫెడరల్‌ రిజిస్టర్‌లో సోమవారం ప్రచురితమైన అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) కొత్త నిబంధన ప్రకారం కనీసం 180 రోజులపాటు ఆన్‌లైన్‌ దాఖలుకు అందుబాటులో ఉన్న ఏ ఫారమ్‌ అయినా ఇకపై ఆ పద్ధతిలోనే సమర్పించాల్సి ఉంటుంది.

అలాగే ముందుగా 60 రోజుల నోటీసు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఫారాలను కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే సమర్పించేలా చేసే అధికారం కూడా ఈ నిబంధన యూఎస్‌సీఐఎస్‌కి కల్పిస్తుంది. ఈ మార్పు గ్రీన్‌ కార్డ్‌ అభ్యర్థనలను, పునరుద్ధరణలు(రెన్యువల్స్‌), కుటుంబ ఆధారిత పిటిషన్లు, ఆశ్రయం క్లెయిమ్‌లు, పనిచేయడానికి అనుమతి దరఖాస్తులు, తాత్కాలిక రక్షిత హోదా ఫైలింగ్‌లు సహా అనేక రకాల దరఖాస్తులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events