Skip to main content

Namaste NRI

ఇస్లామిక్‌ నాటో వచ్చేసింది.. ముస్లిం దేశాల రక్షణ మరిన్ని దేశాలు!

పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియే ఇటీవల మక్కాలో ఒక నూతన రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. మక్కా జాయింట్‌ డిఫెన్స్‌ అగ్రిమెంట్‌గా పిలుస్తున్న ఈ ఒప్పందం నాటో తరహాలోనే ఒక సభ్యదేశంపై దాడి జరిగితే, అది మూడు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తుంది. అమెరికా భద్రతా హామీలపై నమ్మకం సడలుతున్న తరుణంలో పశ్చిమాసియాలో ఒక సరికొత్త ప్రాంతీయ భద్రతా కూటమి నిర్మాణానికి ఇది పునాదిగా మారుతున్నది. ఈ కూటమిలో మరిన్ని ఇస్లామిక్‌ దేశాలను చేర్చుకోవాలని వ్యవస్థాపకులు భావిస్తున్నారు.

ఆఫ్రికాలో బలమైన సైన్యం కలిగిన ఈజిప్ట్‌ను తదుపరి సభ్యదేశంగా చేర్చుకొనేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఖతార్‌, కువైట్‌, జోర్డాన్‌, అజర్‌బైజాన్‌, సిరియా దేశాలు కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకున్న కూటమి కాదని, కేవలం రక్షణాత్మక ఏర్పాటేనని సభ్య దేశాలు చెబుతున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events