Skip to main content

Namaste NRI

సిరియా మాజీ అధ్య‌క్షుడికి మ‌ర‌ణ‌శిక్ష ఖ‌రారు

సిరియా మాజీ అధ్య‌క్షుడు బాష‌ర్ అల్ అస‌ద్‌కు స్థానిక కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేసింది. యుద్ధ నేరాలకు పాల్ప‌డిన కేసులో ఆ శిక్ష‌ను విధించారు. సుమారు 14 ఏళ్ల పాటు సిరియాలో అంతర్యుద్దాన్ని కొన‌సాగించార‌ని, దాన్ని మ‌ర్డ‌ర్‌గా తేల్చుతూ శిక్ష‌ను ఖ‌రారు చేశారు. అస‌ద్ సోద‌రుడు మాహెర్ అల్ అస‌ద్‌కు కూడా యుద్ధ నేరాల కింద మ‌ర‌ణ‌శిక్షను ఖ‌రారు చేశారు. అయితే ఇద్ద‌రూ కూడా ఈ కేసులో కోర్టుకు ప్ర‌త్య‌క్షంగా హాజ‌రు కాలేదు. బాష‌ర్ త‌ర‌పున ఆయ‌న త‌ల్లి బంధువు ఆతెప్ నాజిబ్ హాజ‌ర‌య్యారు.

సిరియా న్యాయ వ్య‌వ‌స్థ తొలిసారి బాష‌ర్ అల్ అస‌ద్‌కు మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేసింది.2024 డిసెంబ‌ర్‌లో అస‌ద్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీ ర‌ష్యాకు ప‌రారీ అయిన విష‌యం తెలిసిందే. హ‌య్య‌త్ తాహిర్ అల్ షామ్ నేతృత్వంలోని విప‌క్ష ద‌ళాలు డ‌మ‌స్క‌స్‌కు దూసుకురావ‌డంతో బాష‌ర్ దేశం విడిచి పారిపోయారు. దీంతో సిరియాలో సుమారు 50 ఏళ్ల అస‌ద్ ఫ్యామిలీ పాల‌న అంత‌మైంది.మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌డం, సామూహిక హ‌త్య‌లకు పాల్ప‌డిందెవ‌రో అన్న‌ కోణంలో విచార‌ణ చేప‌ట్టారు. సిరియా మాజీ అధ్య‌క్షుడు అస‌ద్‌కు ర‌ష్యా ఆశ్ర‌యం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. సిరియాలో జ‌రిగిన మార‌ణ‌హోమంలో సుమారు 5 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం నిరాశ్ర‌యుల‌య్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events