Skip to main content

Namaste NRI

నాగార్జున బర్త్‌‌‌‌డే సందర్భంగా … గీతాంజలి రీ రిలీజ్

నాగార్జున కథానాయకుడిగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం గీతాంజలి. ఈ నెల 28న నాగార్జున జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని 4కే ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్‌ చేయబోతున్నారు. శ్రీపద్మిని సినిమాస్‌ పతాకంపై బూర్లె శివప్రసాద్‌ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

తనదైన కవితాత్మక శైలిలో మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్‌ లవ్‌స్టోరీ 4కే ఫార్మాట్‌లో ప్రేక్షకులకు సరికొత్త వీక్షణానుభూతిని అందిస్తుందని, ఈ సినిమాను థియేటర్లో చూడని నేటి తరం ఈ ఎవర్‌గ్రీన్‌ లవ్‌స్టోరీని బిగ్‌స్క్రీన్‌పై ఎక్స్‌పీరియన్స్‌ చేసే అవకాశం దక్కుతుందని మేకర్స్‌ తెలిపారు. గిరిజ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్నందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events