ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో యువ సాంకేతిక ప్రతిభకు పట్టం కట్టేలా ‘యూత్ కోడ్ ఎ థాన్ 2026’ కార్యక్రమాన్ని నిర్వహించింది. కోడింగ్ రాయడంలో ప్రతిభ ఉన్న యువతను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. ఈ పోటీల్లో పెద్ద ఎత్తువ యువతీ యువకులు పాల్గొని తమ కోడింగ్ ప్రతిభను చాటారు. తమ కోడింగ్ ల ద్వారా కొత్త గేమ్ లను ఆవిష్కరించారు. తమ సృజనాత్మకత, నూతన సాంకేతిక ప్రతిభను చాటుకుని పలువురిని ఆకట్టుకున్నారు. తానా పాఠశాల సహకారంతో ఈ పోటీలు జరిగాయి.
తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి, ఈవిపి శ్రీనివాస్ లావు, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, సెక్రటరీ సునీల్ పంత్ర, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజంటేటివ్ ఫణి కంతేటి, సతీష్ తుమ్మల ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. పోటీలకు సహకరించిన తల్లిదండ్రులు, స్పాన్సర్లు మరియు వాలంటర్లకు అభినందనలు తెలియజేశారు.


ఈ కార్యక్రమాన్ని ముందుండి సమర్థవంతంగా సమన్వయం చేసిన అపర్ణ వాగ్వాలకి, సాంకేతిక వేదికను అత్యుత్తమంగా నిర్వహించిన సుజిత్ వాగ్వాలకి తానా నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ధీరజ్ యలమంచి, కేతన్ మామిడి, క్రిషిత నందమూరి, సాత్విక దుడాలకు మరియు విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ మార్గదర్శకత్వం వహించిన మెంటర్ గోపి వాగ్వాలకు కూడా అభినందనలు తెలియజేసింది.

తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ ‘యువత తమ ఆలోచనలకు పదును పెడుతూ, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇటువంటి వేదికలు ఉపయోగపడుతాయన్నారు. విద్యార్థులు పెద్ద కలలు కంటూ, సాంకేతికతను తెలుసుకోసవడంతోపాటు, దానిలో రాణించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకువెళ్లాలని కోరారు.

విజేతల వివరాలు:
మిడిల్ స్కూల్ విభాగంలో ప్రథమ బహుమతి: వృషిన్ వడకట్టు, ద్వితీయ బహుమతి: అబ్దుల్ రెహమాన్, తృతీయ బహుమతి: దివిజ్ కృష్ణ కోనేరుకు లభించింది.
హై స్కూల్ విభాగంలో ప్రథమ బహుమతి: రిషి నాగబండికి, ద్వితీయ బహుమతి: సర్వేష్ కొమర్రాజుకు దక్కింది.
ప్రత్యేక పురస్కారాలును కూడా అందజేశారు. బెస్ట్ వీడియో: దివిజ్ కృష్ణ కోనేరు, బెస్ట్ గేమ్ప్లే: రిషి నాగబండి, బెస్ట్ ఆడియో: రిషి నాగబండి, బెస్ట్ థీమ్ ఇన్కార్పొరేషన్: వృషిన్ వడకట్టు, కహూట్ విజేతగా వృషిన్ వడకట్టు నిలిచారు.















