హర్ష నర్రా, తన్మయి, ఖుషి, సిజు ఏఆర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మోడ్రన్ మిస్సమ్మ. సాయిబాబా దర్శకుడు. లాస్య అండ్ మిథున క్రియేషన్స్ తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాలోని బెటర్ బీ ఏ మిస్సమ్మ అనే తొలిపాటను విడుదల చేశారు.

గోపీ సుందర్ స్వరపరచిన ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రచించారు. కథపై నమ్మకంతో ఈ సినిమాకు మోడ్రన్ మిస్సమ్మ అనే టైటిల్ పెట్టాం. పెళ్లి నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. వినోదానికి పెద్దపీట వేశా అని దర్శకుడు తెలిపారు. నేటి ట్రెండ్‌కు తగిన సినిమా ఇదని నిర్మాత చిరంజీవి పమిడి పేర్కొన్నారు.















