వెండితెరపై మరో వారసురాలు అరంగేట్రం చేస్తున్నది. హీరో శ్రీకాంత్ కుమార్తె మేధ మేక ఓ అందమైన ప్రేమకథా చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది. మైత్రీ ఇన్ లవ్ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. జై జాస్తి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్నారు.

ముహూర్తపు సన్నివేశానికి నందిని రెడ్డి క్లాప్‌నివ్వగా, సాహు గారపాటి, అర్చన కెమెరా స్విఛాన్ చేశారు. న్యూఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రమిది. ప్రేమ, హాస్యం, కుటుంబ భావోద్వేగాల కలబోతగా ఆకట్టుకుంటుంది అని చిత్రబృందం పేర్కొన్నది. ఈ చిత్రానికి సంగీతం: సాయిహర్ష, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: పృథ్వీ వనం.















