విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జనవరి 12 విడుదల కానుంది. అనిల్ రావిపూడి. తాజాగా మరోమారు సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటేష్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది.

షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. అక్కడి సుందర ప్రకృతి అందాల నడుమ ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఓ పాటతో పాటు టాకీ పార్ట్‌ను కూడా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.















