Skip to main content

Namaste NRI

అలియాస్ రుక్మిణీ.. నితిన్‌తో జోడీ కట్టిన ఆఫియా సయ్యద్.. ఫస్ట్ లుక్ రిలీజ్

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న అలియాస్‌ రుక్మిణి ఈ చిత్రానికి మురళీకాంత్‌ దేవపోత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర హీరో నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి ఆఫియా సయ్యద్‌ కథానాయికగా నటిస్తున్నది. స్కూల్‌ టీచర్‌ రుక్మిణి పాత్రలో ఆమెను పరిచయం చేస్తూ ఫస్ట్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ వీడియోలో విద్యార్థులు ఆమెను హిట్లర్‌, హోంవర్క్‌ పోలీస్‌ వంటి పేర్లతో పిలుస్తుంటారు. చక్కటి అందం, అంతకుమించిన కోపిష్టి స్వభావంతో రుక్మిణి పాత్రను ప్రజెంట్‌ చేశారు.

కృష్ణ గణితశాస్త్ర ఉపాధ్యాయుడు. మంచి రచయిత కూడా. అయితే ఆయన రాసే కథలన్నీ భార్య రుక్మిణి పేరుతో ప్రచురితమవుతుంటాయి. ఈ ప్రేమకథలకు పాఠకుల్లో మంచి ఆదరణ లభిస్తుంటుంది. అయితే భార్య పేరుమీద కృష్ణ కథలు ఎందుకు రాస్తున్నాడు? రుక్మిణి పాత్ర వెనకున్న రహస్యమేమిటి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే అలియాస్‌ రుక్మిణి సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్‌. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని, ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇదని మేకర్స్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events