
కృష్ణకమల్, మహి జంటగా నటించిన చిత్రం జో జో. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ జయకుమార్ దర్శకుడు. విజయ్‌కృష్ణ లింగమనేని నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. రాయలసీమ జొన్నగిరి గ్రామంలో వర్షాలు పడినప్పుడు వజ్రాలు దొరుకుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రేమ, భావోద్వేగాలతో కథ సాగుతుంది. రా రస్టిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. చిత్రానికి కెమెరా: రోహిత్‌కుమార్, సంగీతం: మహేశ్‌శంకర్.















