Skip to main content

Namaste NRI

నేపాల్‌లో మళ్లీ బీభత్సం

మధ్య నేపాల్‌లోని ఓ నదిలో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు పలు ఇండ్లను, మౌలిక సదుపాయాలను ముంచెత్తడంతో తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నేపాల్‌ అధికారులు హెచ్చరించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. గోర్ఖా జిల్లాలోని చుమ్నిబి గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో బుధి గండకి నది ప్రవాహం ఉప్పొంగి, దిగువ ప్రాంతాలలో తీవ్ర వరదలకు దారి తీసిందని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో నది దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరామని గోర్ఖా జిల్లా ఉన్నతాధికారి ధర్మేంద్ర కుమార్‌ పేర్కొన్నారు. వరదల ఉధృతికి పలు ఇండ్లు, రెండు వేలాడే వంతెనలు కొట్టుకుపోయాయని, ఒక జల విద్యుత్‌ ప్రాజెక్టు దెబ్బతిన్నదని మిశ్రా తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events