Skip to main content

Namaste NRI

హెచ్‌-1బీ, ఓపీటీపై కొత్త ఫీజులు.. విద్యార్థులు, యువతకు షాక్

అమెరికాలో చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని భావించేవారికి ఆ దేశం గట్టి షాక్‌ ఇవ్వబోతున్నది. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే H-1B and OPT programs పై భారీగా ఫీజులు విధించగా, ఇప్పుడు వాటిని మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తున్నది. యూఎస్‌ హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఇందుకు సంబంధించిన చర్యలను ప్రారంభించిందని న్యూయార్క్‌కు చెందిన ఇమిగ్రేషన్‌ సంస్థ ఫ్రాగోమెన్‌ తెలిపింది.

కొత్త ఫీజుల వల్ల ఎక్కువగా భారతీయ విద్యార్థులే ఇబ్బంది పడుతారు. ఎందుకంటే యూఎస్‌సీఐఎస్‌ నివేదిక ప్రకారం హెచ్‌-1బీ వీసా పొందుతున్న వారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. గతేడాది ఈ వీసా పొందిన వారిలో 71 శాతం భారతీయులే కావడం గమనార్హం. అలాగే 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు గతేడాది ఓపీటీ ద్వారా అమెరికాలో ఉపాధి పొందారు. ఈ ప్రక్రియపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అనంతరం ఫీజులు ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ ఈ సారి ఫీజులు ఎక్కువ మొత్తంలో పెంచితే భారత విద్యార్థులు అమెరికాలో చదువుకుంటూ తాత్కాళిక ఉద్యోగాలు చేయడం కష్టతరం అవుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events