జల ప్రళయంతో అతలాకుతలమైన నేపాల్ కు ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే తమకు ఎటువంటి సహాయం అవసరం లేదని నేపాల్ పేర్కొన్నది. సెర్చ్, రెస్క్యూ బృందాలు సాయాన్ని నేపాల్ తిరస్కరించింది. తమ స్వంత భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే సామర్థ్యం ఉన్నట్లు నేపాల్ వెల్లడించింది. బుధవారం సంభవించిన బురద, వరద విలయం వల్ల అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అయితే బోటెకోసి, త్రిశూలీ నది పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

రెస్క్యూ ఆపరేషన్ కోసం అనేక దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయని, కానీ ఆ అభ్యర్థనలను తిరస్కరించినట్లు నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది. నేపాలీ సెక్యూర్టీ దళాలే సెర్చ్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వస్తున్న అభ్యర్థనలను తిరస్కరించినట్లు నేపాల్ చెప్పింది.















