Skip to main content

Namaste NRI

ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం కాక‌పోతే ఏఐతో ప్ర‌మాదం: బిల్ గేట్స్‌

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రభుత్వాలు గనుక త్వరితగతిన అప్రమత్తమై నిబంధనలు తీసుకురాకపోతే మానవ సమాజానికి భారీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. గత సాంకేతిక విప్లవాలు ఉద్యోగ అవకాశాలను పెంచినప్పటికీ, ఏఐ విప్లవం మాత్రం అందుకు పూర్తి భిన్నమైనదని గేట్స్ స్పష్టం చేశారు.

ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగైపోతాయని, కేవలం కొన్ని రంగాలు మాత్రమే మానవులకు ఉపాధిని ఇవ్వగలవని తెలిపారు. ఏఐ కోడింగ్ సామర్థ్యాలు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని, నిపుణులైన మనుషుల కంటే మెరుగ్గా పనిచేస్తున్న ఈ సాంకేతికతవల్ల సమీప భవిష్యత్తులోనే ఉపాధి రంగంలో తీవ్ర సంక్షోభం రానుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ కంపెనీలు దీనివల్ల వచ్చే ముప్పును తక్కువ చేసి చూపిస్తున్నాయని, పెట్టుబడులు తగ్గిపోతాయనే భయంతో అసలు ఆందోళనలను బహిరంగంగా అంగీకరించడం లేదని విమర్శించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events