అకస్మికంగా సంభవించిన నేపాల్ వరదలు పలు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. ఆధ్యాత్మిక యాత్రకు వచ్చిన భారత సంతతికి చెందిన అమెరికా దంపతుల ఆచూకీ సైతం తెలియడం లేదు. యూఎస్ నుంచి కైలాష్ మానస్‌సరోవర్ యాత్ర కోసం విచ్చేసిన దీపక్ ఆహుజా, మధు అహుజాలు ఎక్కడ చిక్కుకున్నారు? అనేది అంతు చిక్కడం లేదు.

అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి దీపక్ ఆహుజా(60), మధు అహుజా(57) దంపతులు ఇటీవలే ఆధ్యాత్మిక యాత్రకోసం వచ్చారు. కైలాష్ యాత్రలో భాగంగా వీరు నేపాల్ సరిహద్దు, టిబెట్‌లోని సగాలో తమ బృందంతోపాటు సద్గురును కలిశారు. చివరిసారిగా వీరు కనిపించింది కూడా అక్కడే. అనూహ్యంగా ప్రళయం సృష్టించిన నేపాల్ వరదల తర్వాత దీపక్, మధుల జాడ తెలియడం లేదు. ఇప్పటికే ఈ భయానక వరదల్లో 170మందికి పైగా మరణించారని అధికారికంగా ప్రకటించారు. దాంతో, దీపక్, మధుల గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.















