Skip to main content

Namaste NRI

సందీప్ సరోజ్, సాత్విక జంటగా ప్రారంభ‌మైన వేట

సందీప్‌ సరోజ్‌, సాత్విక జంటగా నటిస్తున్న వేట చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అశోక్‌ కోటిపల్లి దర్శకత్వంలో ఎస్‌ఆర్‌డీ ప్రొడక్షన్స్‌, ఈటీవీ విన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముహూర్తపు సన్నివేశానికి కేఎస్‌ రవికుమార్‌ క్లాప్‌నివ్వగా, సాయిరాజేష్‌, ఎస్‌కేఎన్‌, వీఎన్‌ ఆదిత్య, ఫణి ఆడపాక కెమెరా స్విఛాన్‌ చేశారు. నాగబాబు స్క్రిప్ట్‌ను అందజేశారు. గ్రామీణ నేపథ్యంలో వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, ప్రతీ సన్నివేశం సహజత్వంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు అశోక్‌ కోటిపల్లి తెలిపారు.

ఈటీవీ విన్‌తో కలిసి తాను చేస్తున్న మూడో ప్రాజెక్ట్‌ ఇదని, కమిటీ కుర్రోళ్లు తరహాలోనే చక్కటి సందేశంతో మెప్పిస్తుందని నిర్మాత ఫణి అడపాక పేర్కొన్నారు. కథానుగుణంగా చక్కటి టైటిల్‌ కుదిరిందని హీరో సందీప్‌ సరోజ్‌ అన్నారు. కేఎస్‌ రవికుమార్‌, రాజీవ్‌ కనకాల, రఘుబాబు, రవీంద్ర విజయ్‌, ప్రభావతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాజిద్‌బేగ్‌, సంగీతం: చైతన్‌ భరద్వాజ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అరవింద్‌ మూలే, నిర్మాతలు: ఫణి అడపాక, జయలక్ష్మి అడపాక, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్‌ కోటిపల్లి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events