
అగ్ర కథానాయిక త్రిష కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియో తమిళ ఫిల్మ్ప్రొడక్షన్లోకి అడుగుపెడుతున్నది. ఎయిర్‌లిఫ్ట్ చిత్రంతో గుర్తింపు పొందిన రాజాకృష్ణ మీనన్ ఈ చిత్రానికి దర్శకుడు. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో త్రిష పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో రాధికా శరత్‌కుమార్, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.














